టీఆర్ఎస్ సర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజం..తెరాసకు ఇక అదే గతి అంటూ..

PCC chief Rewanth Reddy flags over TRS government.

0
83

నిత్యవసర ధరల పెరుగుల, సామాన్యుడిపై భారాన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. చేవేళ్ల మండలం ముడిమ్యాల అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్రగా రేవంత్ రెడ్డి బయలుదేరాడు. పాదయాత్రకు ముందు చిలుకూరు బాలజీని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ పాదయాత్రకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ జాతీయ స్థాయిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు చేపట్టాము. చేవెళ్ల కాంగ్రెస్ కు అచ్చోచింది.. ఇక్కడ నుంచి పాదయాత్ర చేసాము. టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంపీటీసీ కావలి సుజాత టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

టిఆర్ఎస్ చెరువుకు గండి పడింది. టిఆర్ఎస్ కు ఇక చేవెళ్ల బస్టాండే గతి. ఈ పాదయాత్రకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ పాల్గొనడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేతిలో డబ్బులు ఉంటే సంచి నిండా సరుకులు వచ్చేవి. ఇప్పుడు సంచిలో డబ్బు తీస్కుకొని పోతే చేతిలో సరుకులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో అగ్గి పుట్టిస్తామని కేసీఆర్ అన్నాడు. అగ్గి పుట్టియ్యలేదు కానీ ఫామ్ హౌస్ లో పండుకొని పెగ్గు తాగిండు. రైతుల వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.