పెళ్లికి కలెక్టర్ ఎంత కట్నం అడిగాడో విని షాకైన పెళ్లికూతురు కుటుంబం

పెళ్లికి కలెక్టర్ఎత కట్నం అడిగాడో విని షాకైన పెళ్లికూతురు కుటుంబం

0
121

సమాజంలో ఐఏఎస్ లు ఐపీఎస్ లు సివిల్ సర్వెంట్స్ ఉన్నతఉద్యోగులుగా సమాజంలో చాలా గొప్ప మార్పులకి శ్రీకారం చుడతారు… వారి జీవితాలు కూడా పలువురికి ఆదర్శంగా ఉంటాయి, తాజాగా ఓ .జంట చేసిన పని కూడా అందరూ చర్చించుకునేలా ఉంది.. తాజాగా ఓ ఐఏఎస్ అధికారికి వివాహం అయింది, అతని భార్య కూడా బాగా చదువుకుని డాక్టర్ గా చేస్తున్నారు.

ఇద్దరు విద్యావంతులు ఉన్నత కుటుంబాలు.. అయితే కట్న కానుకలు కూడా భారీగా ఉంటాయి అని అందరూ అనుకున్నారు, కాని ఆ ఐఏఎస్ కలెక్టర్ గారి కోరిక విని ఆశ్చర్యపోయారు పెళ్లి కుతురు కుటుంబం వారు.

అవును అతను కట్నంగా ఏమి అడిగాడో తెలుసా…వారంలో రెండు రోజుల పాటు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని, అదే తనకిచ్చే కట్నమని చెప్పాడు. అది కూడా తన స్వగ్రామంలో చేయాలి అని కోరాడు. దీనికి ఆమె కూడా ఒకే చెప్పింది. నిజంగా ఎంత ఉన్నత భావాలు ఉన్న వ్యక్తో అని అందరూ అతనిని పొగుడుతున్నారు.