పెళ్లి చేసుకోవాల‌నుకునేవారికి మ‌రో బ్యాడ్ న్యూస్

పెళ్లి చేసుకోవాల‌నుకునేవారికి మ‌రో బ్యాడ్ న్యూస్

0
44

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, దాదాపు 45 రోజులుగా లాక్ డౌన్ లో ఉంది దేశం.. ఈ స‌మ‌యంలో వ్యాపారాలు ఉద్యోగాలు ఎవ‌రూ చేసుకోవ‌డానికి లేదు, అయితే వివాహాలు కూడా వాయిదాప‌డ్డాయి.. ఇక కేవ‌లం ఇర‌వై మంది అతిధుల‌తో మాత్ర‌మే వివాహం చేసుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్నారు.

అయితే ఏప్రిల్ నెల‌లోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి కాని అప్పుడు లాక్ డౌన్ అమ‌లు చేశారు, దీంతో చాలా ముహూర్తాల‌లో వివాహాలు చేసుకోలేదు, వివాహాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు, దీంతో ఇది కేట‌రింగ్, డెక‌రేష‌న్ పురోహితులు లైటింగ్, ఇలా అన్నింటిపై ప్రభావం చూపింది, వారికి ఉపాధి క‌రువు అయింది.

వివాహ ముహూర్తాలు ఎక్కువగా వైశాఖ, జ్యేష్ఠ మాసాలు ఏప్రిల్, మే నెలల్లోనే ఉన్నాయి. ఆపై మూఢం వస్తుంది. జూన్ చివర్లో మొదలయ్యే ఆషాఢం జులై వరకు ఉంటుంది. అప్పుడు పెళ్లిళ్లు ఉండవు. ఆగస్టుశ్రావణంలో ముహూర్తాలు కొన్నే ఉన్నాయి. దీంతో మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కూ పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన ముహూర్తాలు లేవు అంటున్నారు పురోహితులు.