పించన్ రిజక్ట్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఇవే

పించన్ రిజక్ట్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఇవే

0
83

ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పించన్లు 250 పెంచారు.. దీంతో 2250 పించన్లు అందరికి

అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల మంది వయో వృద్దులకు పించన్లు అందిస్తున్నారు.వృద్ధులకు. వితంతువులకు
వికలాంగులకు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు ఎయిడ్స్ పేషంట్లకు, డయాల్సిస్ పేషంట్లకు కల్లుగీత కార్మికులకు
డ్వాక్రా మహిళలకు ట్రాన్స్జెండర్లకు పించన్లు అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.

తాము చెప్పిన విధంగా వైసీపీ ఎన్నికల హామీలో భాగంగా వీరికి పించన్లు పెంచారు. అలాగే పించన్ వయసు కూడా 60 సంవత్సరాలకు తగ్గించారు. ఇక వాలంటీర్లు తాజాగా పలు పించన్లు అప్లై చేసుకున్నవారి ఇంటికి వెళ్లి వెరిఫై చేసుకుంటున్నారు, ఈ సమయంలో మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. గ్రామ వాలంటీర్లు మీ డీటెయిల్స్ అన్నీ చూస్తున్నారు.

ఎవరు అర్హులో వారికి పించన్లు వచ్చేలా చేస్తున్నారు. అయితే కొందరికి పించన్లు రావడం లేదు మరి దీనికి మూడు కారణాలు ఉన్నాయి అంటున్నారు అధికారులు ఎవరికి అయినా పించన్ వచ్చినా పెన్షన్ వస్తున్నా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా వారికి కచ్చితంగా పించన్ రాదు, మీ ఇంటిలో ఎవరికి అయినా పించన్ ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత వస్తే వారు అనర్హులుగా గుర్తిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు, మీరు పించన్ తీసుకోవాలి అంటే మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరూ ఉండకూడదు అనేది ఓ

నిబంధన.అలాగే 60 సంవత్సరాలు కచ్చితంగా నిండి ఉండాలి , పించన్ అప్లై చేసుకునే వారికి అరవై సంవత్సరాలు ఉంటేనే వారు పించన్ కు ధరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు అధికారులు.