ఆ మాజీ టీడీపీ నేతను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు భారీ ప్రయత్నాలు..

ఆ మాజీ టీడీపీ నేతను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు భారీ ప్రయత్నాలు..

0
90

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొద్దికాలంగా వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.. తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని సైకిల్ ను దిగిపోతున్నారు… ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీలు సీనియర్ మోస్ట్ లందరు వైసీపీ కండువా కప్పుకున్నారు… అలాగేముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా నిలిచారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో గట్టి షాక్ తగిలే అవకాశాలుఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. కొద్దికాలంగా ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారట.. ఈ క్రమంలోనే తన రాజకీయ దృష్ట్య ఆయన సైకిల్ దిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… కాగా తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత టీడీపీ తీర్ధం తీసుకుని ఆచంట నుంచి పోటీ విజయం సాధించారు…

మంత్రి కూడా అయ్యారు.. 2019 ఎన్నికల్లో అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు… పశ్చిమ గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది.. ఆ సామాజికి వర్గానికి చెందిన పితానిని వైసీపీలోకి తీసుకువచ్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…