బ్రేకింగ్-మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడికి ఏసీబీ షాక్

బ్రేకింగ్-మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడికి ఏసీబీ షాక్

0
116

ఈఎస్‌ఐ స్కాంలో ఇంకా చాలా మంది ఉన్నార‌ని వారిని ఒక్కొక్క‌రికి బ‌య‌ట‌కు తీస్తాం అంటున్నారు అధికారులు., ఈ కుంభ‌కోణంలో ఎవ‌రి పాత్ర ఉందో ప్ర‌తీది ప‌రిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు..ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.
హైద‌రాబాద్ లో అత‌ను ఉన్నాడు అని స‌మాచారం రావ‌డంతో అక్క‌డ‌కు స్పెష‌ల్ టీమ్ వెళ్లారు.

పితాని మంత్రిగా ఉన్న సమయంలో సురేష్ కొన్ని కంపెనీలకు మందుల కొనుగోలు చేసేందుకు సిఫార్స్ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలిందట. ఇప్ప‌టికే పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్‌ను ఏసీబీ నిన్న అదుపులోకి తీసుకుంది, ప‌లు విష‌యాలు ఆయ‌న వెల్ల‌డించారు.

పితాని కుమారుడు, మాజీ పీఎస్ మురళి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిష‌న్ వేశారు.. . ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ మెడికల్ ఇన్స్యూరెన్స్‌లో2014-15 నుంచి 2018-19 వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేసింది. ఇక మొత్తం ఈ కేసులో 150 కోట్లపైన వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఇప్పుడు పితాని కుమారుడి మెడ‌కు చుట్టుకుంది ఈ కేసు.