నేడు ప్రధాని మోదీ కీలక సమీక్ష..లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే ఛాన్స్..!

Prime Minister Modi's key review today .. Chance to decide on lockdown ..!

0
102

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం నుండి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షన్నరకు పైగా నమోదయ్యాయి.

దీంతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుంది. గత 24 గంటల్లోనే కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కరోనావైరస్ కేసులు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేయనున్నారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 4.30 గంటలకు ఈ సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, ఆక్సిజన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు, వైద్య నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సి చర్యలపై పలు సూచనలు చేయనున్నారు. అలాగే దేశంలో మరోసారి లాక్ డౌన్ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.