టీడీపీలోకి చంద్రబాబును మించినోడు వస్తున్నాడుగా

టీడీపీలోకి చంద్రబాబును మించినోడు వస్తున్నాడుగా

0
77

రాజకీయాల్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మించిన నాయకుడు లేరు… ఆయన రాజకీయంగా ప్లాన్ వేస్తే అది ఖచ్చింగా నెరవేరుతుంది… అంతలా రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు వేరోకరిమీద డిపెండ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి…

2024 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీ తరపున వ్యూహకర్త కోసం న్వేసిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది… ఈ బాధ్యతలను చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది… ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవి చూడటంతో పార్టీలో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం పార్టీ తరపు సరైన నాయకుడు లేరు… వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకోవాలంటే కచ్చితంగా రాజకీయ వ్యూహకర్త అవసరం అని భావిస్తున్నారట. గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇదే పని చేసి ఆకాశమంత విజయాన్ని సొంతం చేసుకున్నారు… ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే బాట పట్టేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.