తెలంగాణాలో వేడెక్కిన రాజకీయం..ముందస్తు ఎన్నికల దిశగా సీఎం కేసీఆర్‌?

0
107

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు. ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిన్న ప్రెస్ మీట్ లో స్వయంగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సవాళ్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి, ముందస్తు ఎన్నికలకు నేను సిద్ధం అని బహిరంగ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.

ఇక కేసీఆర్ ప్రకటనపై బీజేపీ నాయకులు మాట్లాడుతూ..అసలు ‘ముందస్తు ఎన్నికల ముచ్చట’ తీసుకొచ్చిందే తామని అన్నారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్ ను స్వీకరిస్తున్నామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. తాము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్దమే, ఈసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం అని బీజేపీ నాయకులూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రకటనతో టీ కాంగ్రెస్ అప్రమత్తం అయింది. ‘మిషన్ తెలంగాణ’ పేరుతో 80 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి స్పందించారు.  దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి.. ఎన్నికలకు మేము సిద్దమని జీవన్‌ రెడ్డి ఛాలెంజ్‌ విసిరారు. మరి తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు వస్తాయా లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..