టీడీపీకి పోసాని కృష్ణమురళి స్ట్రాంగ్ కౌంటర్….

టీడీపీకి పోసాని కృష్ణమురళి స్ట్రాంగ్ కౌంటర్....

0
95

ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకువెళ్తారని తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మరోసారి ప్రతిపక్షటీడీపీపై అలాగే ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు…

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కులాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమకార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.. అయితే టీడీపీ నేతలు పదే పదే కులాల ప్రస్తావన తీసుకువస్తు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు… జగన్ ఎట్టిపరిస్థితిలో కులాలను ఆపాదించరని అన్నారు…

గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి కులాలకు అతీతంగా ఎలా అయితే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేశారో ఇప్పుడు అదే రీతిలో ముఖ్యమంత్రి జగన్ అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు….. రానున్న రోజుల్లో ఏపీని నంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకువెళ్తారని అన్నారు…