హైదరాబాద్ ప్రజలారా ఆ పార్టీకి ఓటు వేయండి – పోసాని కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ ప్రజలారా ఆ పార్టీకి ఓటు వేయండి - పోసాని కీలక వ్యాఖ్యలు

0
96

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది, ఈ సమయంలో సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు తాము ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాము అనేది చెబుతున్నారు, అంతేకాదు ఎవరికి సపోర్ట్ అనేది తెలియచేస్తున్నారు కొందరు, తాజాగా రాజకీయ నాయకుడు సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన బాగుంది, అభివృద్ది చేశారు,కేసీఆర్ పాలనతో ఆంధ్రులు క్షేమంగా ఉన్నారు అని తెలిపారు ఆయన.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తమేనని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఎంతో పట్టుదలతో పాలన చేస్తున్నారు.. తన జీవితంలో చాలా మంది నాయకులని చూశాను.. కేసీఆర్ అంత పట్టుదల నాయకుడిని చూడలేదు అని పోసాని కొనియాడారు..కేసీఆర్ హయాంలో హిందూ, ముస్లింలు మత సామరస్యంతో ఉంటున్నారని తెలిపారు. రైతులకి నీరు ఇస్తున్నారు, సాయం చేస్తున్నారు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అలాగే గ్రేటర్ లో కచ్చితంగా టీఆర్ఎస్ కు ఓటు వేయాలి అని తెలిపారు.