చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు… టీడీపీ ఎమ్మెల్సీ

చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు... టీడీపీ ఎమ్మెల్సీ

0
103

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్రాప్ లో టీడీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పడొద్దని పోతుల సునీత స్పష్టం చేశారు… తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… శాసనమండలిని టీడీపీ రాజకీయ వేదికగా మార్చేసిందని ఆమె ఆరోపించారు…

చంద్రబాబును రాష్ట్రప్రజలు ఛీ కొట్టినా ఆయనలో మార్పు రాలేదని ఆరోపించారు… శాసనమండలిలో చంద్రబాబు నాయుడు చైర్మన్ షరీఫ్ ను ప్రభావితం చేశారని మండిపడ్డారు… చంద్రబాబు నాయుడు ట్రాప్ లో టీడీపీ నాయకులు పడకుండా హుందాగా వ్యవహరించాలని అన్నారు…

వికేంద్రీకరణపై చైర్మన్ తీసుకున్న నిర్ణం ఓ మచ్చగా మిగిలిపోతుందని అన్నారు… కాగా ఇటీవలే టీడీపీ విప్ ను దిక్కరించి వికేంద్రీకరణకు సునీత ఓటు వేసిన సంగతి తెలిసిందే.. దీంతో ఆమెపై టీడీపీ వేటు వేయాలని నిర్ణయించింది…