వైసీపీలో కాక రేపిన పొట్లూరి…

వైసీపీలో కాక రేపిన పొట్లూరి...

0
94

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలుగుమహిళను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాంటూ ట్వీట్ చేశారు… ప్రస్తుతం ఈ ట్వీట్ సంచలనంగా మరడమే కాకుండా వైసీపీలో కాక రేపుతోంది… బూజు పట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరన్న ప్రభుత్వ వాదనని పక్కన పెట్టి కొత్త శకానికి సుప్రీమ్ కోర్టు నాంది పలికిందని అన్నారు…

గతంలో అన్న ఎన్టీఆర్ ఆడవారికి సమాన ఆస్థి హక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారని అన్నారు పొట్లూరి..ఇప్పుడు అదే స్పూర్తితో మన తెలుగు వారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు…

అవకాశాల్లో సగం ఆస్తిలో సగం ప్రజా ప్రతినిధులలో సగం ప్రభుత్వంలో సగంటూ పోస్ట్ చేశారు… ఈ ట్వీట్ కొన్ని క్షణాల్లో వైరల్ అయింది… దీన్ని వెంటనే డెలిట్ చేశారు.. కానీ నెటిజన్లు స్క్రీన్ షార్ట్ తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు…