ప్ర‌ధాని మోదీ ఖాతాని అందుకే అన్ ఫాలో చేశాము – వైట్‌హౌజ్ క్లారిటీ

ప్ర‌ధాని మోదీ ఖాతాని అందుకే అన్ ఫాలో చేశాము - వైట్‌హౌజ్ క్లారిటీ

0
122

మొన్న మ‌న భార‌త దేశానికి అతిధిగా వ‌చ్చిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కోసం, మ‌న దేశంలో ఎన్నో ఏర్పాట్లు చేశారు.. అద్బుత‌మైన ఆతిధ్యం ఇచ్చాం, అయితే అమెరికా ఇప్పుడు వైర‌స్ స‌మ‌యంలో ఇబ్బందుల్లో ఉంటే వారికి మెడిస‌న్ కూడా అందించాం. అయి‌తే ఇటీవ‌ల వైట్ హౌజ్ చేసిన చ‌ర్యపై పెద్దదుమారం రేగింది.

భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌజ్‌ అన్‌ఫాలో చేసింది. దీంతో ఎందుకు ఇలా చేశారు అనేదానిపై చాలా మంది కామెంట్లు చేశారు. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌శ్నించారు.

అయితే దీనిపై తాజాగా అమెరికాలోని వైట్‌హౌజ్‌ స్పందించింది…విదేశీ పర్యటనలో సమయంలో అమెరికా అధ్యక్ష భవనం ఆయా దేశ అధినేతలు, వారి కార్యాలయాలను ట్విటర్‌లో తాత్కాలికంగా మాత్రమే అనుసరిస్తుందని స్పష్టం చేసింది. పర్యటన పూర్తయిన తర్వాత వీటిని అన్‌ఫాలో చేయడం చేస్తాము అని తెలిపింది, మొత్తానికి ఇది వైట్ హౌస్ నిర్ణ‌యం అని తెలిపింది, దీంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చ‌ర్య‌పోయారు.