జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆయన ఎవరిని బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి అని చెబుతున్నారు.. దీని వల్ల వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది అని చెబుతున్నారు.
ఇక ఏపీ తెలంగాణకు చెరో 50 లక్షల చొప్పున ఇస్తాను అని ప్రకటించిన పవన్ కల్యాణ్ తాజాగా ప్రధాని సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా పక్రటించారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తనవంతు భాగస్వామ్యం కోసం ఈ నిధులు అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ కష్టకాంలో ప్రధాని మోదీకి బాసటగా నివాల్సిన అవసరం ఉంది. ఆయన నాయకత్వం, స్ఫూర్తిదాయక చర్యలు ఈ కష్టం నుంచి దేశాన్ని గట్టెక్కించగవని నమ్ముతున్నాఅంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి రెండు కోట్ల రూపాయలు పవన్ కల్యాణ్ కరోనా కట్టడి కోసం విరాళంగా అందించారు.