తెలంగాణ లో లాక్ డౌన్ పై కేసీఆర్ ఏమ‌న్నారంటే

తెలంగాణ లో లాక్ డౌన్ పై కేసీఆర్ ఏమ‌న్నారంటే

0
35

తెలంగాణ‌లో రెండు రోజులుగా లాక్ డౌన్ విజ‌య‌వంతంగా అమ‌లు జ‌రుగుతోంది, మొన్న రోడ్ల‌పైకి వ‌చ్చిన జ‌నాలు ఇప్పుడు త‌గ్గారు అనే చెప్పాలి.. ఉద‌యం రెండు మూడు గంట‌ల్లో పాలు నిత్య అవ‌స‌ర వ‌స్తువులు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. బ‌య‌ట‌కు వ‌స్తున్న వారిని వ‌దిలిపెట్టేది లేదు అని పోలీసులు చెప్ప‌డంతో అంద‌రూ కూడా ఇంటిలోనే ఉంటున్నారు.

ఇలా క‌ష్ట‌ప‌డుతున్న అధికారులు, పోలీసు వ్యవస్థకు అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, పక్కాగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిన్న రాత్రి పది గంటల వరకూ తన కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు సీఎం కేసీఆర్

ప‌లువురు అధికారుల‌కి ఫోన్ చేసి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.. అలాగే జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో కూడా ఆయ‌న మాట్లాడారు..వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే, ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, సామాజిక దూరాన్ని పాటించడమే మన ముందున్న ఉత్తమ మార్గమని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రెండు వారాలు ఇలా ఉండే క‌చ్చితంగా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాము అని తెలిపారు.