ప్రధానికి తన కోరిక చెప్పిన మంచు లక్ష్మీ – ఎస్ చెప్పిన మోదీ

ప్రధానికి తన కోరిక చెప్పిన మంచు లక్ష్మీ - ఎస్ చెప్పిన మోదీMODI BJP

0
93

ప్రధాని నరేంద్రమోదీని ఢిల్లీలో సినీనటుడు మోహన్ బాబు కుటుంబసభ్యులు కలిశారు.. అయితే ఆయన బీజేపీలో చేరుతున్నారా అనే వార్తలు వినిపించాయి, ఇది రాజకీయ భేటీ కాదు అని తన విద్యాసంస్దలకు సంబంధించిన విషయంపై ఆహ్వనం అందించారు అని వార్తలు వినిపించాయి.

తాజాగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఈ విషయంపై స్పందించారు. మోదీని తాము కలవడం వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదని స్పష్టం చేశారు. రెండోసారి ప్రధాని అయిన మోదీని ఇటీవల పాన్ ఇండియా సినీ నటులందరూ కలిసి అభినందించిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదు అంటున్నారు .

ఆరోజు ప్రధాని మోదీని కలిసే అవకాశం కొందరికి మాత్రమే వచ్చింది .. ఇప్పుడు దక్షిణాది సినీ రంగ ప్రముఖులతో భేటీ కావాల్సిందిగా మోదీ నుంచి మాట తీసుకున్నానని చెప్పారు. దక్షిణాది నుంచి రిప్రజెంటేటివ్ గా మీటింగ్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని, త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంచు లక్ష్మి చెప్పింది. సో సౌత్ స్టార్ తో త్వరలో భేటీ కానున్నారట.