తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు… ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ పాలకుడు శ్రీరాముడని తెలిపారు. అధికారాన్ని ప్రజోపయోగంగా ఎలా వినియోగించాలో రాముడు మనకు తెలియచెప్పాడని గుర్తు చేశారు…. అందుకే గాంధీజీ సైతం స్వతంత్ర భారతదేశం రామరాజ్యంలా విలసిల్లాలని కోరుకున్నారని తెలిపారు…
అలాంటిది గత ఏడాదిగా ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధి పనులు ఆగిపోవడం బాధాకరం అని అన్నారు… ప్రతి ఏటా వీధివీధినా చలువపందిళ్ళలో వేడుకగా జరిగే సీతారాముల కళ్యాణోత్సవాలు ఈ ఏడాది కరోనా వల్ల ఇళ్లకే పరిమితం అయ్యాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, రాజ్యం సుభిక్షంగా ఉండాలనేదే కోదండరాముడి ఆకాంక్ష అని అన్నారు
కాబట్టి ఈ పండుగవేళ ఇళ్ళకే పరిమితమై శ్రీరాముని దివ్య చరిత్రను మననం చేసుకుందామరి అన్నారు. మన ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యంతోపాటు సమాజ ఆరోగ్యం కాపాడదాం అని అన్నారు…