చంద్రబాబు కి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్

చంద్రబాబు కి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్

0
115

నిజ‌మే ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచితూచి మాట్లాడాలి…వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల్లో సాయం చేస్తున్నారు.. మొత్తానికి ఈ విష‌యంలో తెలుగుదేశం ముందు నుంచి కూడా పీకే పై ప‌లు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది, బీహార్ వాళ్లు వారికి ఏమీ తెలియ‌దు అనేలా విమ‌ర్శ‌లు ఈ మ‌ధ్య బాగా పెంచారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల స‌మ‌యం క‌దా అని ఆగిన పీకే తాజాగా చంద్ర‌బాబుకి పై సంచ‌ల‌న ట్వీట్ పెట్టారు.

మహామహా నాయకులే ఒక్క ఓటమితో తుడిచిపెట్టుకుపోయారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. చంద్రబాబు వాడుతున్న భాష, అంటున్న మాటలు బీహార్‌ మీద ఆయనకు ఎంత ద్వేషం, చిన్న చూపు ఉందో తెలుస్తోంది. నన్ను తిట్టేముందు…ఏపీ ప్రజలు మీకు మళ్లీ ఎందుకు ఓటేయాలో చెప్పండి” అని ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ వ్యక్తి పీకే అంట ఇలా ప‌లు ర‌కాల వ్యాఖ్య‌లు సీఎం, తెలుగుదేశం నేతలు చేయ‌డం ఆయ‌న దృష్టికి వెళ్ల‌డంతో, ఆయ‌న ఇలాంటి ట్వీట్ పెట్టారు అని తెలుస్తోంది., ఆయ‌న వ్యూహ‌క‌ర్త‌గా పేరు సంపాదించారు. ఎవ‌రికి అయినా సాయం కాంట్రాక్ట్ బ‌ట్టీ చేస్తారు, కాని ఆయ‌న‌పై బాబు తెలుగుదేశం నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిటి అని కొంద‌రు మేధావి వ‌ర్గం కూడా త‌ప్పు ప‌డుతోంది.