ప్రశ్నించడంలో పీహెచ్ డీ చేస్తున్న పవన్

ప్రశ్నించడంలో పీహెచ్ డీ చేస్తున్న పవన్

0
89

ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ప్రశ్నించడం పనిగా పెట్టుకున్నారు, ఒటమి గురించి ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు… ఈ ఎన్నికల్లో ఎక్కడా గెలవని పవన్ కల్యాణ్ రాజోలు ఎమ్మెల్యేతో జనసేన బండి నడుపుతున్నారు.. తాజాగా రేపిస్టులకు వేయాల్సిన శిక్షలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్ చేశారు. సింగపూర్ లో రేపిస్టులకు అమలు చేస్తున్న శిక్షలను ఇక్కడ కూడా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దీంతో యువత కూడా ఆయన పిలుపుపై తమ అభిప్రాయాలు చెబుతోంది.

మొత్తానికి పవన్ కల్యాణ్ డిమాండ్ బాగానే ఉంది.. కేంద్రం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఆడబిడ్డల ప్రాణాలను మానాలకు విలువ లేదా సంరక్షించుకోరా వైసీపీకి 151 సీట్లు ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు ఆయన..సుగాలి ప్రీతి విషయంలో ఆధారాలున్నా.. ఎలాంటి న్యాయం చేయలేకపోయారని మండిపడ్డారు.

మొత్తానికి ఇటుకేసీఆర్ కు అటు జగన్ కు ఇద్దరికి పంచ్ లు వేసి ప్రశ్నించారు అంటున్నారు రాజకీయ మేధావులు.. పవన్ గత ఆరునెలల్లో తన పర్యటనలతో ప్రజల్లో మరింత వేగంగా వెళుతున్నారు అని అంటున్నారు సీనియర్ అనలిస్టులు.