Breaking: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..

0
105

నేడు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ ఎన్నికలు  జూలై నెలలో జరుగుతాయని ఈ మేరకు తెలియజేసారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24వ తేదీన ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ రాజీవ్‌ కుమార్ షెడ్యూల్ విడుదల చేసారు.

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఇదే..

 జూలై 18- రాష్ట్రపతి ఎన్నిక

జూలై 21- కౌంటింగ్ నిర్వహిస్తారు.

జూలై 24- తేదీ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఈ నెల 15- నోటిఫికేషన్ విడుదల కానుంది.

 ఈ నెల 29- నామినేషన్లను ఈ తేదీ వరకు స్వీకరిస్తారు.

జూన్ 30- స్క్రూటినీ జరగనుంది.

జూలై 2- వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంటుంది.