జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ

Prime Minister Modi attends the G20 summit

0
96
G20 2021

ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్​లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ..మోదీకి సాదర స్వాగతం పలికారు. గౌరవ వందనం నడుమ మోదీ జీ20 సమావేశ వేదికకు చేరుకున్నారు.

కరోనా మహమ్మారి తర్వాత తొలిసారి ఈ సదస్సు భౌతికంగా జరుగుతోంది. ప్రపంచంలోని ఆర్థికంగా శక్తిమంతమైన 20 దేశాలు పాల్గొంటున్న ఈ సమావేశంలో ప్రధానంగా వాతావరణ మార్పు, కరోనా, కార్పొరేట్​ ట్యాక్స్​ అంశాలపై చర్చ జరగనుంది. ప్రారంభ సెషన్​లో ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక అంశాలను ముఖ్యంగా ప్రస్తావించనున్నారు. అనంతరం జరిగే కీలక సమావేశంలో ఇరాన్​ అణు కార్యకలపాల అంశంపై జీ-20 దేశాధినేతలు చర్చించనున్నారు.

G-20 సదస్సులో చారిత్రక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో సంస్కరణలకు సభ్యదేశాల అధినేతలు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ కనీస పన్నును 15శాతంగా నిర్ణయించారు. ఈ విషయాన్ని G-20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి వెల్లడించారు. పారదర్శక, ప్రభావవంతమైన అంతర్జాతీయ పన్ను వ్యవస్థకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.  ఈ ఒప్పందంతో మల్టీ నేషనల్​ కంపెనీలు ఇక నుంచి 15శాతం పన్నును ఆయా దేశాలకు చెల్లించాల్సి ఉంటుంది.