సినీ నటుడు పృథ్వీరాజ్ వైసీపీలో చాలా కష్టపడ్డారు.. దానికి ప్రతిఫలంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్… కాని ఓ ఉద్యోగినితో సరస సంభాషణ ఆడియో బయటకు రావడంతో సినీనటుడు పృథ్వీరాజ్‌ను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు, అప్పటి నుంచి ఆయన పెద్ద మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు.
తాజాగా నేడు ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రపూరితంగా తనను ఎస్వీబీసీ నుంచి తప్పించారని, తనను బయటకు పంపి కొందరు పైశాచికానందం పొందారని చెప్పారు. కొన్ని రోజులుగా తీవ్ర మానసిన ఒత్తిడి వేదనకు గురి అయ్యాను అన్నారు.
గతంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అమలు చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని పృథ్వీరాజ్ ఆరోపించారు.తాను గతంలో అమరావతి రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని వ్యాఖ్యలు చేయడం పై స్పందించారు ..తాను వారిని కించపరచలేదు అని అన్నారు . ఎప్పటికీ వైసీపీలోనే కొనసాగుతాను అని తెలిపారు రాజు.