పులివెందుల ప్రజలకు జగన్ స్వీట్ న్యూస్

పులివెందుల ప్రజలకు జగన్ స్వీట్ న్యూస్

0
94

పులివెందులలో సీఎం జగన్ కు భారీ మెజార్టీ వచ్చింది. దీంతో అక్కడ వైయస్ ఫ్యామిలీకి ఎదురు లేదు అని మరోసారి నిరూపితం అయింది. ఇక జగన్ స్టేట్ పాలన చూసుకోవాలి కాబట్టి, పులివెందుల డవలప్ మెంట్ పై తన అనుచర గణంతో అక్కడ అభివ్రుద్దికి ఓ కమిటీ వేశారు అని తెలుస్తోంది. అక్కడ తాగునీరు సాగునీరు సమస్యలేకుండా చేయాలి అని జగన్ పూనుకున్నారు.

అయితే పార్టీ తరపున తనకు సంబంధించిన ఇద్దరు కీలక నేతలను అక్కడ ప్రజా సమస్యల కోసం నియమించారట. ఎక్కడా పులివెందుల ఆఫీసుల్లో లంచం అడిగినా వారి ఉద్యోగాలు పోతాయి అని చెబుతున్నారట ఇద్దరు నేతలు.. ప్రతీ పని 48 గంటల్లో జరగాలి అని కచ్చితంగా ఎందుకు జరగలేదో లబ్దిదారులకు అర్జీదారులకు తెలియచేయాలి అని చెబుతున్నారు.

జగన్ ఇప్పటికే లంచం అవినీతి లేకుండా పారదర్శకంగా ఉద్యోగులు పనిచేయాలి అని చెబుతున్నారు.. ఈ సమయంలో తాజాగా సొంత ప్రాంతం పులివెందుల ఏపీలో మోడ్రన్ సెగ్మెంట్ గా తన నియోజకవర్గం తీర్చిదిద్దాలి అని నిర్ణయం తీసుకున్నారట, అక్కడ స్కూల్లు కాలేజీలు ప్రభుత్వ ఆస్పత్రి అన్నింటికి మహర్ధశ రానుంది అని చెబుతున్నారు అక్కడ ప్రజలు.