చంద్రబాబును దుమ్ము దులిపిన పురందేశ్వరి….

చంద్రబాబును దుమ్ము దులిపిన పురందేశ్వరి....

0
88

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీజేపీ నేత పురందేశ్వరి దుమ్ము దులిపారు… రాజధాని నిర్మాణంలో విఫలం అయిన చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలను నిలువునా మోసం చేశారని ఆమె మండిపడ్డారు…

తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… అమరావతిలో రైతులు అడిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆమె…. రాజధాని నిర్మాణం పేరిట కోట్ల రూపాయలను దోచుకున్నారే తప్ప చేసింది ఏం లేదని అన్నారు…

గతంలో కేంద్ర 2500 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇచ్చిందని పురందేశ్వరి గుర్తు చేశారు… అయితే వాటి గురించి సరైన లెక్కలు చూపించలేదని మండిపడ్డారు… పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆమె స్పష్టం చేశారు…

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేత అమిత్ షా తిరుమలకు వస్తే టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారని కానీ అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడు ఆయనపై రైతులు దాడి చేస్తే గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు…