ఆ విషయంలో రగిలిపోతున్న దేవినేని ఉమా

ఆ విషయంలో రగిలిపోతున్న దేవినేని ఉమా

0
82

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నేతలు పెద్ద పెద్ద పదవులు పొందారు.. అయితే వారిలో ఇరిగేషన్ మంత్రిగా దేవినేని ఉమా పని చేశారు .. ముఖ్యంగా వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆయనని టార్గెట్ చేశారు.. అలాగే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు, విజయసాయిరెడ్డి కూడా దేవినేనిపై నిత్యం ట్విట్టర్లో విమర్శలు చేసేవారు.

అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయిన వంశీ ముఖ్యంగా దేవినేని ఉమా పై చేసిన వ్యాఖ్యలు ఏపీ అంతా మార్మోగిపోతున్నాయి… తన కుటుంబాన్ని తొక్కి రాజకీయాల్లోకి వచ్చాడు అని ఆయన చేసిన విమర్శలు ఉమా కోపాన్ని చల్లార్చడం లేదు, అయితే అధికారంలో ఉన్న సమయంలో తనతో పనులు చేయించుకుని, ఇప్పుడు నేను అన్ని పనులకి అడ్డుపడ్డాను అని వంశీ విమర్శలు చేయడం, దేవినేని తట్టుకోలేకపోతున్నారట.. చంద్రబాబు అవకాశం ఇస్తే వంశీ అక్కడ పోటీ చేస్తే, గన్నవరం నుంచి పోటీ చేసి వంశీని ఓడిస్తా అని ఉమా చెబుతున్నారట.