మే 7న చంచల్ గూడ జైలకు రాహుల్ గాంధీ

0
98

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మే 7న ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు రానున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ పోలీస్‌ స్టేషన్‌ లో అరెస్టు అయిన ఓయూ నేతలను కలిసి పరామర్శించేందుకు చంచల్ గూడ జైలుకు వస్తాడని తెలిపాడు. కేవలం అయన ఒక్కడే కాకుండా టీపీసీసీ నాయకులందరూ వస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ నెల 7 వ తేదీ న బలమురి వెంకట్ తో పాటు 18 మంది నాయకులను కలవడానికి మేమందరం కలసికట్టుగా వస్తామని తెలిపారు. దీనికి సంబంధించి వినతిపత్రం కూడా చంచల్ గూడ సూపరింటెండెంట్ ని కలిసి ఇచ్చామని పేర్కొన్నారు. అందుకు రాహుల్ జైలు సందర్శనకు అన్ని ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్ ని కోరినట్టు తెలిపారు.

జైలు అధికారులు స్వతంత్రగా వ్యవహరించాలని కోరారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతితో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలి. రాహుల్ గాంధీ ఓయూ పర్యటన పై మా నేతలు విసిని కలిసినప్పుడు  విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు రాహుల్ గాంధీ రావాలని కోరారు. కానీ కేసీఆర్ ఒత్తిడి కారణంగానే  రాహుల్ గాంధీ పర్యటనను తిరస్కరించినట్టు తెలిపారు.

NSUI విద్యార్థి సంఘం నేతలు విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ పర్యటన ఉంటుందని విసిని విజ్ఞప్తి చేశారు. అక్కడికి వెళ్లిన మా విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించడం న్యాయం కాదని పేర్కొన్నాడు. ఓయూలో విద్యార్థి నాయకులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఈరోజు ఎక్కడ ఉండేవారో ఒక్కసారి ఉహించుకోండని ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి.