చాలాకాలం తర్వాత రైళ్లు మళ్లీ నడుస్తున్నాయి.. అవి కూడా కొన్ని సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి, అయితే అన్ లాక్ 4 లో 80 రైళ్లు నడవనున్నాయి.రైలు ప్రయాణం చేసేవారు కేంద్రం సూచించిన కరోనా నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని రైల్వే అధికారులు తెలిపారు.
కచ్చితంగా టికెట్ కన్ఫామ్ అయిన వారు మాత్రమే ప్రయాణానికి రావాలి.
టికెట్లు ఉన్న వారు మాత్రమే ప్రయాణం చేయాలి
ఫేస్ మాస్క్ కచ్చితంగా ఉండాలి
ధర్మల్ స్క్రీనింగ్ కచ్చితంగా చేయించుకోవాలి
భౌతిక దూరం పాటించాలి
భారీగా లగేజీ తీసుకురావద్దు
ప్రయాణానికి నిర్ణీత సమయం కంటే ముందే స్టేషన్‌కు రావాలి.
లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతి ఇస్తారు
హెల్త్ ప్రోటోకాల్ అక్కడ ఏ స్టేట్ లో దిగితే అక్కడ వారు ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలి,
ప్రయాణికులందరూ ఎవరికి వారే తమ సొంత దుప్పట్లను క్యారీ చేయాలి
మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది, ఎక్కడా గుమిగూడి ఉండద్దు, రైలు ప్రయాణికులు కచ్చితంగా దగ్గు జలుబు కరోనా లక్షణాలు ఉంటే ప్రయాణాలు కాన్సిల్ చేసుకోవాలి.