2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత పార్టీ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది . తమ పార్టీ ని మల్లి బలోపేతం చేసి తదుపరి ఎన్నికల్లో అయినా ప్రతిపక్షానికి గట్టి పోటీ ఇవ్వాలన్న ఆలోచన ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు . కొన్ని చోట్ల టీడీపీ కార్యాలయాల తలుపులు ఎప్పుడూ మూస్ ఉంటున్నాయట .
అయితే టీడీపీ పార్టీ తీరుపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చేసిన వాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి . బాబు గారు అప్పుడప్పుడు పెట్టె ఆన్లైన్ కాన్ఫిరెన్స్ మీటింగ్ ల వాళ్ళ ఫలితం శూన్యమని , ఈ మీటింగ్ ల పార్టీ కి ఒరిగేదేమి లేదంటూ అయన వాఖ్యానించారు .
ప్రజలు పార్టీ ని మరిచిపోకముందే మనం అప్రమత్తమవ్వాలని ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం చేసినప్పుడే ప్రజలు పార్టీ వైపు చూస్తారని అయన అన్నారు . హైదరాబాద్ కేంద్రంగా ప్రజా సమస్యలపై పోరాటం సరైనది కాదని , సమస్య ఉన్నచోటికి మనమే వెళ్లాలని ,లేకపోతే ఇంకొన్ని రోజుల్లో టీడీపీ ప్రస్తావన లేని ఆంధ్రప్రదేశ్ ని చుడాల్సి వస్తుందని అయన అన్నట్లు సమాచారం .