రాజధానిపై అఖిల ప్రియ న్యూ కామెంట్స్

రాజధానిపై అఖిల ప్రియ న్యూ కామెంట్స్

0
84

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఆమె పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాజధానిని అమరావతిలో ఉంచాలని లేదంటే కర్నూల్ జిల్లాకు మార్చాలని ఆమె డిమాండ్ చేశారు…

రెండు సార్లు విభజన వల్ల రాయలసీమ నష్టపోయిందని అన్నారు… అందుకే రాజధాని మార్చాలనుకుంటే రాయలసీమకు ఇవ్వాలని ఆమె కోరారు… రాజధానిపై మూడు ప్రాంతాల్లో విద్వేశాలు జరిగితే 13 జిల్లాల్లో జిల్లాకో రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నారు..

కాగా ఇటీవలే అఖిల ప్రియ రాజధాని అమరావతిలో ఉంచాలని డిమాండ్ చేశారు.. ఇప్పుడు అమరావతిలో కుదరకపోతే రాయలసీమలో ఏర్పాటు చేయాలని అంటున్నారు… అలాగే జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే….