రాజకీయ వారుసుడ్ని ప్రకటించిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరంటే

రాజకీయ వారుసుడ్ని ప్రకటించిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరంటే .

0
90

సినిమా పరిశ్రమలో రాజకీయాల్లో వారసుల ఎంట్రీ కాస్త లేట్ అయినా జరుగుతుంది అనేది తెలిసిందే, అవును ఇది మన ఏపీలో తెలంగాణలోనే కాదు దేశం అంతా ఇలాగే ఉంది, అయితే ఏపీలో చాలా మంది నేతలు తమ రాజకీయ వారసులని ఈ ఎన్నికల్లో నిలబెట్టారు, వారి అదృష్టం ఎలా ఉందో పరీక్ష చేశారు, కొందరు గెలిస్తే మరికొందరు ఓటమి పాలయ్యారు, ఇది ఒక్క పార్టీ అనే కాదు అన్నీ పార్టీల్లో ఉన్న తీరు..

తాజాగా రాజమండ్రి పేరు చెబితే వినిపించే పేరు సీనియర్ నాయకుడు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తాజాగా ఆయన తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. తన సోదరుడి కుమారుడైన డాక్టర్ రవి రామ్కిరణ్ను తన వారసుడిగా ప్రకటించారు.

ఇక రాజమహేంద్రవరం నుంచి రామ్ కిరణ్ రాజకీయ ప్రస్ధానం మొదలు అవుతుంది అని బుచ్చయ్య చౌదరి తెలిపారు, అంతేకాదు ఆయన టీడీఎల్పీ ఉప నేతగా ఉన్నారు, కాని ఈ పదవికి రాజీనామా చేస్తాను అని ప్రకటించారు. అది బీసీ నేతకు ఇవ్వాలి అని కోరతాను అన్నారు ఆయన. రామ్ కిరణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇక పార్టీ కోసం ఆయన కష్టపడి పనిచేస్తాడు అని తెలిపారు బుచ్చయ్యచౌదరి.. ఇక బుచ్చయ్యచౌదరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.