ఏపీలో రాజ్యసభ సభ్యుల రేసులో వీరు నలుగురు

ఏపీలో రాజ్యసభ సభ్యుల రేసులో వీరు నలుగురు

0
102

ఏపీలో వైయస్ జగన్ ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టుల విషయంలో మంచి క్లారిటీగా ఉన్నారు.. ఇప్పటికే సీనియర్లకు పార్టీలో ముందు నుంచి తన వెంట ఉన్నవారికి పదవులు ఇచ్చారు.. ఇప్పుడు తాజాగా ఏపీ అసెంబ్లీ కోటాలో రాజ్యసభ సభ్యత్వాలకు కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. కనివిని ఎరుగని రీతిలో మొత్తం అన్ని పదవులూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే దక్కనున్నాయి, దీంతో ఆ రేసులో ఎవరు ఉన్నారు అనేది చర్చ జరుగుతున్న అంశం.

ఇక రాజ్యసభ సీట్లు అన్నీ కూడా వైసీపీకి ఏపీ నుంచి దక్కనున్నాయి.. టీడీపీ రేసులో కూడా ఉండే అవకాశం లేదు.. తాజాగా ఈ రాజ్యసభ సీట్ల రేసులో ఉన్నవారిని చూస్తే, జగన్ బాబాయి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి పేరు వినిపిస్తోంది., అలాగే పార్టీలో కీలక నేత జగన్ కు సన్నిహితుడు అయిన వ్యాపార వేత్త ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డికి కూడా పదవి రానుందట.

గత వారం వైసీపీలో చేరిన గోకరాజు కుటుంబీకులు ఒకరికి రాజ్యసభ సీటు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటీవల వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు కూడా రాజ్యసభ బెర్త్ ఖరారు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.. రేసులో వీరి నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. మరి చివరకు జగన్ ఎవరికి పదవులు ఇస్తారో చూడాలి.