రాఖీ పౌర్ణమి..మహిళలకు TSRTC బంపర్ ఆఫర్!

0
92

మహిళలకు TSRTC శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న ఆలోచనలతో ఆర్టీసీని గాడిలో పెడుతున్నారు. ఆయా ప్రత్యేక రోజుల్లో బస్సుల్లో ప్రయాణానికి వివిధ ఆఫర్లని తెస్తూ ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేస్తున్నారు. ఇక రాఖి పండుగ సందర్బంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాఖీ పౌర్ణమి రోజున మహిళలు వారి సోదరులకి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితులు ఉంటే.. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసుల ద్వారా.. అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకోవచ్చని ప్రకటించింది. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసుల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది.

పూర్తి సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించాలని టీఎస్‌ ఆర్టీసీ సూచించింది. ఊర్ల నుంచి హైదరాబాద్ రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పుడూ తోడు ఉంటుందని..అందుకే వారికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఆర్టీసీ తెలిపింది.

.