రామమందిరం పై కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ

రామమందిరం పై కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ

0
88

అయోధ్య రామమందిర నిర్మాణం పనులు ఇక చక చక జరుగనున్నాయి, కోర్టు తీర్పుతో ఇక ఈ మందిర వివాదానికి ఫుల్ స్టాప్ పడింది, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రామమందిర ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ వేదికగా కీలక ప్రకటన చేశారు.. ఇక రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టుకు ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇక్కడ భారీ రామ మందిరం నిర్మిస్తాము అని ప్రకటించారు, దానికి అవసరమైన ప్లాన్స్ ఉన్నాయి అని సిద్దం చేశారు అని తెలిపారు ప్రధాని మోదీ.
ఈ ట్రస్ట్ ఏర్పాటుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఇలా ట్రస్ట్ ఏర్పాటు చేశాము అని ప్రధాని ప్రకటన చేయగానే సభలో బీజేపీ ఎంపీలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేసి బల్లలు చరిచారు.

అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణం కోసం అప్పగిస్తూ గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో అందరూ సంతోషం వెల్లిబుచ్చారు.. కూలగొట్టిన బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్య పరిధిలో 5 ఎకరాల భూమిని ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఈ వివాదానికి ఓ పరిష్కారం వచ్చిం