చంద్రబాబుకు తాకిన రవిప్రకాశ్ పంచాయితీ

చంద్రబాబుకు తాకిన రవిప్రకాశ్ పంచాయితీ

0
99

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై 100 కోట్లు పరునష్టం దావా వేస్తామని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మేనేజర్ ఇటీవలే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు.. గతంలో మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మీడియా నయీం అని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ చూసుకుని ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ఇప్పుడు తానే పెద్ద బ్రేకింగ్ న్యూసై పోయారని ఆరోపించారు. వంద కోట్లు ఏం ఖర్మ వెయ్యి కోట్లకు వేసుకో ‘పరువు’ నష్టం దావా అని అన్నారు.. కాగా నిన్న రవిప్రకాశ్ మేనేజర్ ఒక ప్రకటన విడుదలు చేశారు.

రవి ప్రకాశ్ పై అసత్య ఆరోపణలు చేసి ఆయన పరువుకు భంగం కలించినందున తాము పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నామని మేనేజర్ తెలిపారు… ఏబీసీఎల్ సంస్థలోకి రామేశ్వరరావు, మేఘా కృష్ణా రెడ్డిలు చట్ట వ్యతిరేకంగా ప్రవేశించారని తెలిపారు. ప్రస్తుతం వారిద్దరే రవి ప్రకాశ్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తన ప్రకటనలో తెలిపారు…