రవిప్రకాష్ అరెస్ట్ కి రంగం సిద్ధం..!!

రవిప్రకాష్ అరెస్ట్ కి రంగం సిద్ధం..!!

0
103

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తాజాగా బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. టీవీ9 లోగోల విక్రయం కేసులో ఆయనకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని సూచించారు.

మరోవైపు.. టీవీ9 సంస్థ బదలాయింపు సంతకాల ఫోర్జరీ వ్యవహారంలో అలంద మీడియా చేసిన ఫిర్యాదుపై రవిప్రకాశ్‌ను మూడో రోజు సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హాజరైన ఆయనను పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. తాము అడుగుతున్న ప్రశ్నలకు రవిప్రకాశ్‌ సరైన సమాధానాలు చెప్పడంలేదని పోలీసులు పేర్కొంటున్నారు. గత రెండు రోజులుగా సుదీర్ఘంగా ఆయనను విచారించిన పోలీసులు ఈ రోజు రాత్రి వరకు ఆయనను విచారించే అవకాశం ఉంది.