దేవిశ్రీతో నాకు పెళ్లా.. రంగస్థలం హీరోయిన్..!!

దేవిశ్రీతో నాకు పెళ్లా.. రంగస్థలం హీరోయిన్..!!

0
74

టాలీవుడ్ లో ఏజ్ వస్తున్న ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటున్న సెలెబ్రిటీల లిస్ట్ లో దేవిశ్రీప్రసాద్ ముందుంటాడు.. ఏజ్ ఎక్కువవుతున్న ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం సినిమా ల మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఇంకా పెళ్లి మీద చూపించట్లేదు.. అయితే ఎఫైర్ లపై ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై రూమర్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. మొదట్లో ఛార్మి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లంటూ వార్తలు రాగ ఆ తర్వాత అవి ఒత్తి వార్తలు తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు..

తాజగా రంగస్థలం లో ఆది పినిశెట్టి జోడిగా చేసిన పూజిత పొన్నాడ కి దేవి కి లింక్ పెట్టారు.. దానిపై ఆమె స్పందించారు. దేవిశ్రీతో పెళ్లి అంటూ వచ్చే రూమర్లను పూజిత కొట్టి పారేశింది. ‘రంగస్థలం’ 100 రోజుల వేడుక ముందు వరకు తాను అసలు దేవిని ఒక్కసారి కూడా కలవలేదని ఆమె స్పష్టం చేసింది. అసలు మనం కలవని, మాట్లాడని ఓ వ్యక్తితో పెళ్లెలా అవుతుంది? ఇలాంటి వదంతులకు తలా తోక ఉండదు. ఒకప్పుడు ఇలాంటి రూమర్లు విని తెగ బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు వాటి వల్ల నాకు పాపులారిటీ వస్తోంది కాబట్టి నేను సంతోషంగానే ఉన్నా’’ అంటూ చివర్లో కొసమెరుపు లాంటి మాట చెప్పింది పూజిత.