రాయలసీమలో టీడీపీ బిగ్ వికేట్ డౌన్

రాయలసీమలో టీడీపీ బిగ్ వికేట్ డౌన్

0
107

2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీని తిరిగి యాక్టివ్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు… 70 ఏళ్ల వయస్సులో పార్టీని భూజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు…

అయితే తమ్ముళ్లు మాత్రం తలోదారి పడుతున్నారు….. తమ రాజకీయ దృష్ట్య ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు…. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే…. అయితే ఇదే క్రమంలో మరో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు…

కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు… గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు… తన రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య దూరం చేయడం సరికాదరి సుధాకర్ బాబు ఆరోపించారు… తాను ఏ పార్టీలో చేరాలో అనే దానిపై అనుచరులతో చర్చించి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు…