రికార్డ్ బద్దలు కొట్టే దిశగా సీఎం జగన్ రైట్ హ్యాండ్

రికార్డ్ బద్దలు కొట్టే దిశగా సీఎం జగన్ రైట్ హ్యాండ్

0
86

కడప జిల్లాలో పులివెందుల తర్వాత ఏపీ వ్యాప్తంగా రాయచోటి నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.. గతంలో ఈ సెగ్మెంట్ నుంచి సుగవాసి పాలకొండ్రాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ శృష్టించారు.. ఇప్పటి వరకు ఆయన రికార్డ్ ను బద్దలు కొట్టిన నాయకుడు ఎవ్వరు లేరు… అయితే 2009 నుంచి వరుస విజయాలు సాధిస్తున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ రికార్డ్ ను బద్దలు కొడతారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు.. 2009లో శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు… ఆ తర్వాత వైఎస్ మృతి చెందడంతో ఆయన ఆ కుటుంబానికి అండగా నిలిచారు.. 2012లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు… ఇక 2014 ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు… కానీ పార్టీ అధికారం దక్కించుకోలేక పోయింది… అయినా కూడా ఆయన ప్రజల ప్రక్షాణ నిలిచారు..

ఒక వైపు ప్రజల అవసరాలను తీర్చుతూ మరోవైపు అప్పటి అధికార టీడీపీపై విమర్శలు చేస్తుండేవారు… రాయచోటి సెగ్మెంట్ లో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది….ఆ సమస్యను శ్రీకాంత్ రెడ్డి తీర్చి ప్రజలకు మరింత దగ్గర అయ్యారు… 2019 ఎన్నికల్లో పోటీ చేసి గతంలో కంటే ఆయన ఎక్కువ మెజార్టీని సాధించి రికార్డ్ బద్దలు కొట్టారు.. ఇక 2024లో కూడా ఆయన గెలిపు నల్లేరు మీద నడకే అంటున్నారు విశ్లేషకులు… సుగవాసి పాలకొండ్రాయుడు రికార్డ్ ను బద్దలు కొట్టడం కేవలం శ్రీకాంత్ రెడ్డి వల్లే అవుతుందని అంటున్నారు…