అయితే ఇప్పుడు దేశం అంతా చర్చించుకునేది జోన్లు గురించి.. మరి ఈ జోన్ల ప్రకారం ఏఏ జోన్లులో ఏ ఆంక్షలు ఉంటాయి అనేది ప్రతీ ఒక్కరికి డౌట్ గా ఉంది, మరి రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్ అంటే ఏమిటి అక్కడ ఏ ఆంక్షలు ఉంటాయి ఏ వెసులుబాటు ఉంటుంది అనేది చూద్దాం.
రెడ్ జోన్లో ఉన్నవారికి బయటకు వెళ్లడానికి బైక్ అనుమతి ఉండదు, ఆరెంజ్ గ్రీన్ జోన్లో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది…. ఇక రెడ్ జోన్లో కారు అనుమతి ఉండదు, గ్రీన్ ఆరెంజ్ జోన్లో డ్రైవర్ తో పాటు మరోకరు వెళ్లవచ్చు.
ప్రజా రవాణా రెడ్ జోన్ లో అనుమతి లేదు, కేవలం గ్రీన్ జోన్లో సీట్లలో 25% మించకుండా అనుమతి ఇస్తారు. ఇక వ్యవసాయం చేసుకునే వారికి రెడ్ జోన్ లో అనుమతి ఉండదు, ఆరెంజ్ గ్రీన్ జోన్లో అనుమతి ఉంది.
చిన్న తరహా పరిశ్రమలకు రెడ్ జోన్లో అనుమతి లేదు… గ్రీన్ ఆరెంజ్ జోన్లో కేవలం స్ధానికులకే అవకాశం ఉంది.. మాల్స్ కి రెడ్ ఆరెంజ్ జోన్లో అనుమతి లేదు.. బ్యాంకులకు రెడ్ జోన్ లో అనుమతి లేదు, ఆరెంజ్ జోన్ లో 50% ఉద్యోగులకు అనుమతి ఉంది.