కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా అవుతున్న నాటినుంచి కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్, రెడ్ జోన్ లాంటి పదాలు వాడకం జరిగింది… దీని గురించి కొంత మందికి అవగాహన ఉంటుంది మరి కొందరికి అవగాహన లేకపోవచ్చు అందుకే వారికోసం క్లుప్తంగా వివరిస్తోంది…
కోవిడ్ 19 కేసులను గుర్తించి నిర్దిష్ట ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా పిలుస్తారు… కంటైన్ మెంట్ జోన్ చుట్టు ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్ గా పరిగణిస్తారు…
అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు ఉండి ఇన్ఫెక్షన్ శాతం ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను రెడ్ జోన్ గా లేదా హాట్ స్పాట్ అంటారు… కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఆరెంజ్ జోన్ గా పిలుస్తారు…
కొద్దికాలంగా కరోనా కేసులు నమోదు కానీ ప్రాంతాలను గ్రీన్ జోన్ గా పిలుస్తారు… ఏదైనా ఒక ప్రాంతంలో నాలుగు కంటే ఎక్కువ కేసులు నమోదు అయితే దాన్ని కంటైన్మెంట్ జోన్ గా పరిగణిస్తారు…