ఏపీలో మళ్ళీ ఎన్నికలు ఈసీ డేట్ ప్రకటన

ఏపీలో మళ్ళీ ఎన్నికలు ఈసీ డేట్ ప్రకటన

0
97

ఏప్రిల్ 11 న ఏపీలో జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల అవకతవకలు ఈవీఎంల మొరాయింపు జరిగింది.. దీంతో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి కంప్లైంట్ కూడా ఇచ్చారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్ నంబర్ 94, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్ నంబర్ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 97, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం బూత్ నంబర్ 197లో రీ పోలింగ్ జరపాలి అని చెప్పారు.

ఇక కేంద్ర ఎన్నికల సంఘం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, మే 6 వ తేదిన ఎన్నికలు జరుగనున్నాయి.. ఇక ఈ ఫలితాలు మే 23వ తేదిన వెల్లడికానున్నాయి. ఇప్పటికే ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాలను కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించడానికి సిద్దం చేస్తున్నారు అధికారులు.