రైతులకు జగన్ లేఖలు కీలక సందేశం మరో హామీ నెరవేర్చిన జగన్

రైతులకు జగన్ లేఖలు కీలక సందేశం మరో హామీ నెరవేర్చిన జగన్

0
75

కొత్త సంవత్సరం రైతులకి కేంద్రం శుభవార్త చెప్పింది.. కిసాన్ డబ్బులు మూడో విడత కూడా అందరికి ఇప్పటికే జమ అయ్యాయి కేంద్రం నుంచి.. ఈ సమయంలో ఏపీలో కూడా రైతులకి గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది. నేడు అంటే గురువారం వారి బ్యాంకు అకౌంట్లలోకి రూ.2వేలు జమ చేయనుంది ఏపీ సర్కారు. పీఎం కిసాన్ కింద రావాల్సిన భరోసా సొమ్మును రైతు భరోసా పథకం కింద అందజేయనున్నారు. ప్రభుత్వం 46,50,629 మందికి రైతు భరోసా తుది విడత మొత్తం.. రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేయనున్నారు. ఇప్పటికే దీని కోసం నిధులు కూడా విడుదల చేశారు.

గత నెల 15 వరకూ అందిన ధరఖాస్తులు పరిశీలించి వారికి కూడా ఇవ్వనున్నారు ఈ సాయం..రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రూ.13,500 ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే రూ.11,500ను జమ చేయగా.. మిగిలిన రూ.2వేలు ఇప్పుడు జమ చేస్తున్నారు. ఇక ఎవరు అర్హులు అనేది గ్రామ సచివాలయాల్లో వారి పేర్లు జాబితా తెలియచేస్తారు..ముఖ్యమంత్రి జగన్ రైతులకు లేఖలు రాశారు. గ్రామ వాలంటీర్లు రైతులకు ఈ లేఖల్ని అందజేసి, రసీదుపై సంతకం తీసుకుంటారు.

అయితే వినూత్నంగా ఈ పథకం ఏపీలో అమలు అవుతోంది, ఏపీలో జగన్ సర్కారు రైతులకి బాగా సాయం చేస్తోంది అంటున్నారు రైతులు, అయితే అప్లై

చేసుకున్న వారికి అందరికి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు జమ అయ్యేలా చూడాలి అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులని ఆదేశించారు.