Breaking News : తెలంగాణ పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి

Revanth Reddy Appointed As TPCC chief

0
143

ఎన్నో ఆటుపోట్లు, ఎంతో కసరత్తు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ పిసిసి చీఫ్ ను ఎట్టకేలకు ఖరారు చేసింది. అన్ని కోణాల్లో పరిశీలన చేసిన తర్వాత పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది.

అయితే పిసిసి రేస్ లో అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోపాటు అనేక మంది పోటీ పడ్డారు. కానీ డైనమిక్ లీడర్ గా గుర్తింపు పొందడం, కేసిఆర్ కుటుంబాన్ని ఢీకొనడంలో రేవంత్ రెడ్డికి ఉన్న ఛెరిష్మా కారణంగా అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపింది.

అయితే రేవంత్ రెడ్డికి పిసిసి ఇస్తే పార్టీకి గుడ్ బై చెబుతామని ఇప్పటికే కొందరు సీనియర్లు ఓపెన్ గానే చెప్పారు. అయితే రేపటి నుంచి అసమ్మతులు ఎవరనేది తేలనుంది. ఎవరెవరు కాంగ్రెస్ లోనే ఉంటారో? ఎవరు బయటకు పోతారో అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఇక వర్కింగ్ ప్రసిడెంట్లు గా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, మహేష్ గౌడ్ లను నియమించింది అదిష్టానం. కోమటిరెడ్డికి ఎఐసిసిలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సీరియర్ వైస్ ప్రసిడెంట్లు గా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, పోడెం వీరయ్య, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి కుమార్ రావు, జావిద్ అమీర్ లను నియమించింది అధిష్టానం.

క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీ గౌడ్ నియమితులయ్యారు. ప్రచార కమిటీ కన్వీనర్ గా సయ్యద్ అస్మదుల్లా హుస్సేన్ నియమితులయ్యారు.

ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ గా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ నియమితులు అయ్యారు.

ఎఐసిసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు.

ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం మేరకు ఎఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎఐసిసి జారీ చేసిన లెటర్