తెలంగాణలో కరోనా తగ్గుముఖం : బులిటెన్ రిలీజ్, జిల్లాల లిస్ట్ ఇదే

Telangana Corona Cases Bulletin Released

0
44

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే శనివారం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ వెల్లడైన కరోనా బులిటెన్ లో 1028 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క జిహెచ్ఎంసి లో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాలు తొమ్మిది ఉన్నాయి. నిన్న ఏడు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదు కాగా ఇవాళ మరో రెండు జిల్లాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. మిగతా అన్ని జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి.

శుక్రవారం నమోదైన కేసులు 1061 కాగా, గురువారం నమోదైన 1088 కేసులు, బుధవారం నమోదైన 1114 కేసులు, మంగళవారం కేసులు 1175 కంటే ఇవాళ కేసుల నమోదులో తగ్గుదల కనబడుతున్నది.
ఇవాళ మరణాల సంఖ్య 9 గా నమోదైంది. శుక్రవారం 11 మరణాలు చోటు చేసుకోగా, గురువారం మరణాల సంఖ్య 9 కాగా, బుధవారం 12 మంది మరణించారు. మంగళవారం మరణాల సంఖ్య 10 ఉంది. మరణాల సంఖ్య గడిచిన వారం రోజులుగా పదికి అటూ ఇటుగా నమోదవుతున్నది. ఇవాళ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.

జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసిలో మాత్రమే 132 కేసులతో త్రిబుల్ డిజిట్ నమోదైంది. సింగిల్ డిజిట్ కేసులు ఆదిలాబాద్, జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ లలో నమోదయ్యాయి. ఇక ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సైతం పరిస్థితి ఆశాజనకంగా మారి డబుల్ డిజిట్ కు కేసులు చేరుకున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు 118427 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1489 గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 15054 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1201.

నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 5
కొత్తగూడెం 46
జిహెచ్ఎంసి 132
జగిత్యాల 21
జనగామ 8
జయశంకర్ భూపాలపల్లి 20
జోగులాంబ గద్వాల 5
కామారెడ్డి 1
కరీంనగర్ 58
ఖమ్మం 76
కొమరం భీం ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 18
మహబూబాబాద్ 53
మంచిర్యాల 42
మెదక్ 5
మేడ్చల్ మల్కాజ్ గిరి 43
ములుగు 27
నాగర్ కర్నూల్ 12
నల్లగొండ 66
నారాయణపేట 5
నిర్మల్ 2
నిజామాబాద్ 8
పెద్లపల్లి 48
రాజన్న సిరిసిల్ల 17
రంగారెడ్డి 64
సంగారెడ్డి 12
సిద్దిపేట 38
సూర్యాపేట 65
వికారాబాద్ 13
వనపర్తి 17
వరంగల్ రూరల్ 24
వరంగల్ అర్బన్ 45
యాదాద్రి భువనగిరి 25