కొత్త పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి నాగం జనార్దన్ రెడ్డి సన్మానం

0
36

టిపిసిసి నూతన అధ్యక్షులుగా ఎంపికైన రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి సన్మానం చేశారు. కొత్త పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీలో పనిచేసిన సీనియర్లందరినీ కలుస్తున్నారు. తొలుత పెద్దలు జానారెడ్డిని కలిసి ఆశిస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కొండా సురేఖ లాంటి సీనియర్లను కలిశారు.

గురువారం నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి నాగం శాలువా కప్పి సన్మానం చేశారు. కొత్త పిసిసి చీఫ్ గా కార్యకర్తల మనసు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాడలని నాగం సూచించారు.

అయితే నాగం, రేవంత్ రెడ్డి మధ్య సుదీర్ఘ రాజకీయ బంధం ఉంది. గతంలో వారిద్దరూ టిడిపిలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇద్దరూ పాలమూరు జిల్లాకు చెందినవారే. పాలమూరు జిల్లాలో బలమైన నేతలుగా ఉన్నా… ఇప్పుడు ఇద్దరూ ఓడిపోయి ఉన్నారు. నాగం టిడిపి వీడిన తర్వాత తెలంగాణ నగారా సమితి అనే సంస్థను స్థాపించారు. తర్వాత బిజెపిలో చేరారు. అక్కడ నాయకత్వంతో విభేదాలు రావడంతో కాంగ్రెస్ లో చేరారు. పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటికీ నాగం శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. (వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు)

https://fb.watch/6t8IE9fLQy/

ఇక రేవంత్ రెడ్డి టిడిపి వీడిన తర్వాత డైరెక్ట్ కాంగ్రెస్ కు వచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్ గిరి కి వలస వచ్చి ఇక్కడ గెలిచారు. అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు.