సింగరేణిలో 50 వేల కోట్ల కుంభకోణం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ఫైర్

0
101

టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా వీలు దొరికినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ధాన్యం కొనుగోళ్ల విషయంలో, సింగరేణి కోల్ మైన్స్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. సింగరేణి కోల్ మైన్స్ కి సంబంధించి ప్రధానికి ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరుగుతున్న సింగరేణి సిఎండి శ్రీధర్ పై డీఓపీటీ ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం లేదు. సింగరేణి కుంభకోణంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి కోల్ నిభంధనలు ఉల్లంఘించి గనులు కేటాయిస్తున్నారు. మోడీ ప్రభుత్వం కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 50 వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది. పారదర్శకంగా కోల్ మైన్ టెండర్లు ఖరారు చేయాలి.

వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు బిజెపికి ఫండింగ్ చేస్తుంది కేసీఆర్. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను బలహీన పరచడానికి ఒవైసి, కేసీఆర్ తిరుగుతున్నారు. సింగరేణి కోల్ మైన్స్ అవినీతి పై కోర్టును ఆశ్రయిస్తాం. బిజెపి, టిఆర్ఎస్ రెండు ఒకటే. సింగరేణి అంశంపై ప్రధాని వెంటనే సిబిఐ విచారణకు అదేశించాలి..లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు మా ఫిర్యాదులను బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.