టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. కేసీఆర్ తెచ్చిన జీవో 317తో కన్నతల్లికి, తల్లితో సమానమైన జన్మభూమికి దూరమై… చిరునామా గల్లంతై ఉపాధ్యాయులు క్షోభ అనుభవిస్తున్నారు. శాశ్వతంగా తమ స్థానికతను కోల్పోతున్నారు. 317 ప్రకారం స్థానికతకు విరుద్ధంగా నియామకాలు చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం.
ఉపాధ్యాయుల ఆందోళన పై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నందున కేంద్ర హోం శాఖ జోక్యం అనివార్యం. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర సర్కారు జోక్యం చేసుకుని రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉన్న జీవో 317ను రద్దు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం నుండి జీవో 317పై ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.