Flash: నెక్ట్ పోటీ అక్కడి నుంచే-క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

0
92

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు రేవంత్. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వరుస నిరసన కార్యక్రమాలు, ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొస్తున్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ మధ్యే డిజిటల్ మెంబెర్ షిప్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గంలో డిజిటల్ మెంబెర్ షిప్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక్కో బూతులో 500 మందిని సభ్యత్వాలు చేసిన కార్యకర్తలను రేవంత్ సన్మానించారు.

తన పోటీ ఎక్కడి నుంచి అనే ఊహాగానాలకు రేవంత్ రెడ్డి తెరదించారు. తాను మళ్ళీ కొడంగల్ నుంచే పోటీ చేస్తా అని రేవంత్ తేల్చి చెప్పారు. ఢిల్లీకి రాజు అయిన తల్లికి బిడ్డనే..నేను ఎంత ఎదిగిన కొడంగల్ బిడ్డనే అని రేవంత్ రెడ్డి ఎమోషన్ అయ్యారు. కొడంగల్ లో 75 వేల సభ్యత్వాలు చేసిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. 119 నియోజకవర్గాలకు 75 వేల సభ్యత్వాలు చేసి కొడంగల్ ఆదర్శంగా ఉంది. కొడంగల్ నేతలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, లాంటి పథకాలు వచ్చాయి. మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్.. 2009 లో కొడంగల్ కు నేను కొత్త, అయిన కడుపులో పెట్టుకొని గెలిపించారన్నారు.

కొడంగల్ ప్రజల రుణం తీర్చుకోలేనిది. కొడంగల్ గుడి, బడి, రోడ్లు వేయించిన, 5 వేల సబ్ స్టేషన్ లు నేను తెచ్చిన..కోస్గి బస్ డిపో, మద్దూర్ లో స్కూల్ కు నాసొంత భూమి ఇచ్చిన… కొడంగల్, కోస్గి, మద్దూర్ లలో జూనియర్ కాలేజిలు, కొడంగల్ లో డిగ్రీ కాలేజ్ నేను కట్టించిన.. కొడంగల్ ప్రతి గ్రామానికి రోడ్డు, వాటర్ ట్యాంక్ లు కట్టించిన… కొడంగల్ లో తాగునీటి కోసం 350 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన… 2 ఏండ్లలో కృష్ణ నీళ్లతో కొడంగల్ ప్రజల కాళ్ళు కడుగుతా అన్న పట్నం సన్యాసి ఎక్కడ..కొడంగల్ లో వందల కొట్లతో రోడ్లు వేసింది నేను. పోలిస్ లను అడ్డుపెట్టుకొని నన్ను ఓడించారు.

కొడంగల్ ను దత్తత తీసుకున్న దరిద్రుడు కేటీఆర్ ఎక్కడ. ఈ మూడేళ్లలో కొడంగల్ రోడ్లపై తట్టెడు మట్టి తీయలేదు. 2018లో 5 మంది మంత్రులు కోస్గి బస్ డిపోకు శంకుస్థాపన చేసిండ్రు. కానీ ఎందుకు కట్టలేదో ఆ దరిద్రులు చెప్పాలి. టిఆర్ఎస్ నేతలకు ఇదే నా సవాల్. నియోజకవర్గం అభివృడ్డి పై చర్చకు వస్తారా.. కోస్గిలో 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన..నేను ఉన్నప్పుడు పని ఎక్కడ ఉందో ఇప్పుడు అక్కడే ఉంది. టిఆర్ఎస్ నేతలు గుండెలపై చెయ్యివేసుకొని చెప్పాలి. నేను ఎప్పుడైనా అభివృద్ధికి అడ్డుపడ్డనా.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్న నేను ఎమ్మెల్యేగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టించలేదు.

ఈ మూడు సంవత్సరాలు నేను కావాలనే కొడంగల్ కు రాలేదు. నేను వస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్న అని అంటారని రాలేదు. సిద్దిపేట, గజ్వేల్ ఎందుకు భివృద్ది అవుతున్నాయి కొడంగల్ ఎందుకు అవ్వడం లేదు.. కొడంగల్ ప్రజలు నాటిన రేవంత్ అనే మొక్క ఈరోజు పెద్ద చెట్టుగా ఎదిగింది. మీడియా చర్చ పెట్టాలి కొడంగల్ లో నేను చేసింది. ఏంటి టిఆర్ఎస్ చేసింది ఏంటి అని.. షాదీ ముభారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులు పాస్ బుక్కు లు ఇవ్వడనికి ఎమ్మెల్యే వస్తున్నాడు. ఇదా అభివృద్ధి అంటే హకీమ్ పెట్ గ్రామంలో ఒక యువకుడి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు ఆంబోసిన ఆంబోతుళ్ళ దాడి చేశారు. పోలె పల్లి చిన్న ఘటన జరిగితే హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ ల్లారా జాగ్రత్త ఎప్పటికి టిఆర్ఎస్ అధికారంలో ఉండదు. మా వాళ్లను ఇబ్బంది పెడుతున్న ఒక్కొక్కడికి మిత్తితో చెల్లిస్తా..ఖాకి గుడ్డలు ఊడదీయిస్తా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స్థానిక ఎమ్మెల్యేకు ప్రతి ఒక్కరు మామూళ్లు ఇవ్వాలి. వ్యాపారస్తులు నెల నెలా మామూళ్లు ఇవ్వలేక ఏడుస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఎవ్వరి దగ్గరైన ఒక్క రూపాయి తీసుకున్న నా… మూడేండ్ల కాలం ఓపిగ్గా ఉన్నాం. అది చేతగాని తనం కాదు.. ఎమ్మెల్యే నేను తలుచుకుంటా ఎలా ఉంటదో మీ ముఖ్యమంత్రిని అడుగు .. కొట్లాడుదాం అంటే సరే ఎమ్మెల్యే గిరి గియ్ వస్తా.. వేలమంది పోలీస్ లతో మీ మంత్రులు వస్తే తరిమి కొట్టిన చరిత్ర మాది.. బిడ్డ ఎమ్మెల్యే సద్ది కట్టుకొని షాబాద్ వచ్చి కొడుతాం…. గ్రామాల్లో చర్చ పెట్టండి రేవంత్ సర్ ఉన్నప్పుడు కొడంగల్ ఎలా ఉంది ఇప్పుడు సారా తాగే వాడు ఉంటే ఎలా ఉందో చర్చ పెట్టండి. నేను పీసీసీని అది నా గొప్ప కాదు. కొడంగల్ ప్రజల గొప్పతనం అని గుర్తు చేసుకున్నారు.