KCRకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..రైతులను ఆదుకోవాలని డిమాండ్

Rewanth Reddy's open letter to KCR, demanding support for farmers

0
69

తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే మిర్చి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. మిగత పంటలకు ఎకరానికి 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి పంట మంచిగా పడితే ఎకరాకు 3.50 లక్షల ఆదాయం వస్తోందని ఆశపడి ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెట్టారు. తామర తెగులుతో తీవ్రంగా నష్టపోయారు..

ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులను, అధికారులను పంపించారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి దాదాపు 8.633 కోట్ల నష్టం వచ్చింది. కేంద్రం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏమి చేశారు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.